
ఐపిఎల్‌లో భాగంగా శుక్రవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ సీజన్‌లో కోల్‌కతాకు ఇది నాలుగో విజయం. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. ఓపెనర్లు పాథుమ్ నిసాంకా (50), కెఎల్ రాహుల్ (23) శుభారంభం అందించారు. చివర్లో అశుతోష్ శర్మ (39) మాత్రమే కాస్త మెరుగ్గా రాణించాడు. మిగతా వారు విఫలమయ్యారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా 14.2 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఓపెనర్ ఫిన్ అలెన్ 47 బంతుల్లోనే అజేయంగా 100 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. కామెరూన్ గ్రీన్ 33 (నాటౌట్) తనవంతు పాత్ర పోషించాడు.















