నేడు పంజాబ్‌తో పోరు

న్యూఢిల్లీ: ఐపిఎల్‌లో భాగంగా శనివారం మధ్యాహ్నం పంజాబ్ కింగ్స్‌తో జరిగే పోరు ఢిల్లీ క్యాపిటల్స్‌కు సవాల్‌గా మారింది. ఈ సీజన్‌లో పంజాబ్ ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్‌లో కూడా ఓటమి పాలు కాలేదు. ఆడిన ఆరు మ్యాచుల్లో ఐదు విజయాలను అందుకుంది. ఒక మ్యాచ్ వర్షం వల్ల రద్దయ్యింది. ప్రస్తుతం పంజాబ్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పంజాబ్ సమతూకంగా ఉంది. ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, నెహల్ వధెరా, శశాంక్ సింగ్, జాన్సన్, స్టోయినిస్ తదితరులతో పంజాబ్ బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. అంతేగాక చాహల్, అర్ష్‌దీప్ సింగ్, జాన్సన్, స్టోయినిస్‌లతో బౌలింగ్ కూడా బాగానే ఉన్న సంగతి తెలిసిందే. ఇలాంటి స్థితిలో ఢిల్లీకి ఈ మ్యాచ్ సవాల్‌గా తయారైంది. ఇందులో విజయం సాధించాలంటే ఢిల్లీ సర్వం ఒడ్డి పోరాడక తప్పదు. అయితే నిసాంకా, రాహుల్, నితీశ్ రాణా, సమీర్ రిజ్వి, మిల్లర్, స్టబ్స్, అశుతోష్ తదితరులతో ఢిల్లీ బ్యాటింగ్ కూడా బాగానే ఉంది. దీంతో పోరు ఆసక్తికరంగా సాగడం ఖాయం.