
ఇజ్రాయెల్ లెబనాన్ మధ్య చారిత్రాత్మక దౌత్య చర్చలు గురువారం వాషింగ్టన్ లో పునఃప్రారంభం కానున్నాయి. ఈ విషయాన్ని ఇజ్రాయెల్, లెబనాన్, అమెరికా అధికార వర్గాలు వెల్లడించాయి. అంతర్గత చర్చలకు సంబంధించిన సమాచారం కావడంతో, అధికారులు గోప్యతా నిబంధనల మేరకు పేర్లు వెల్లడించలేదు. దశాబ్దాల తరువాత గత వారం ఇజ్రాయెల్, లెబనాన్ రాయబారులు నేరుగా సమావేశమై చర్చలు జరపడం గమనార్హం. ఈ చర్చల ద్వారా హిజ్బుల్లా మిలిటెంట్లను నిరాయుధీకరించడం, లెబనాన్‌తో శాంతి ఒప్పందం కుదుర్చుకోవడం లక్ష్యమని ఇజ్రాయెల్ వెల్లడించింది.ఇదే సమయంలో లెబనాన్‌లో 10 రోజుల కాల్పుల విరమణ శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చింది.
అమెరికాఇజ్రాయెల్ సంయుక్త దాడులు ఇరాన్‌పై ప్రారంభమైన రెండో రోజునే, ఇజ్రాయెల్, ఇరాన్ మద్దతు ఉన్న హిజ్బుల్లా మిలిటెంట్ల మధ్య ఘర్షణలు చెలరేగాయి. లెబనాన్‌లో జరిగిన పోరాటాల్లో ఇప్పటివరకు 2,290 మందికి పైగా మరణించినట్లు సమాచారం. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇరాన్లో కనీసం 3,375 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. అదనంగా ఇజ్రాయెల్లో 23 మంది, గల్ఫ్ అరబ్ దేశాల్లో మరికొందరు ప్రాణాలు కోల్పోయారు. లెబనాన్‌లో 15 మంది ఇజ్రాయెల్ సైనికులు, ప్రాంతవ్యాప్తంగా 13 మంది అమెరికా సైనికులు కూడా మరణించినట్లు సమాచారం.



