
న్యూఢిల్లీ: కాల్పుల విరమణను పొడిగిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఓ కంటైనర్ నౌకపై ఇరాన్ కాల్పులు జరిపింది. పాకిస్తాన్‌లో జరగాల్సిన రెండో విడత కాల్పుల విరమణ చర్చలు విఫలమైన నేపథ్యంలో ఇరాన్ పారామిలిటరీ దళమైన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్(UKMTO) బుధవారం హోర్ముజ్ జలసంధిలో ఒక కంటైనర్ నౌకపై కాల్పులు జరపింది. కాల్పుల్లో ఆ నౌక ధ్వంసమైనట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో హోర్ముజ్ జలసంధి వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
దీనిపై స్పందించిన యునైటెడ్ కింగ్‌డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్(UKMTO).. ఉదయం 7.55 గంటల ప్రాంతంలో ఈ దాడి జరిగిందని, ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా గార్డ్ గన్‌బోట్ ఒకటి నౌకను లక్ష్యంగా చేసుకుందని తెలిపింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు, పర్యావరణ నష్టం జరగలేదని ఇరాన్ పారామిలిటరీ దళం వెల్లడించింది. ఇటీవల అమెరికా ఓ ఇరాన్ కంటైనర్ నౌకను స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.



