నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణలో వాతావరణం మార్పులతో ఇవాళ వర్షాలు కురిసే అవకాశం ఉంది. భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం కొత్తగూడెం, ఖమ్మం, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబాబాద్ జిల్లాల్లో వడగళ్లతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా, మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

The post నేడు తెలంగాణలో పిడుగులతో కూడిన వర్షాలు appeared first on Navatelangana.