
హైదరాబాద్: ప్రజాస్వామ్య దేశంలో జనాభా లెక్కల సేకరణ గొప్ప కార్యక్రమం అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. జనగణనలో భాగంగా ఆయన ఆదివారం స్వీయ ధృవీకరణ చేసుకున్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. జనగణనలో తొలిసారి కులగణన జరుగుతోందని పేర్కొన్నారు. వివరాలు చెప్తే సంక్షేమ పథకాలు తొలగిస్తారనే భయం వద్దన్నారు. అందరూ ధైర్యంతో వివరాలు ఇవ్వాలి అని కోరారు.
‘‘ఎన్నికల కమిషన్ చేపట్టిన ఎస్‌ఐఆర్‌ను అభినందించాలి. దీని వల్ల నకిలీ ఓట్లు తగ్గించొచ్చు. నకిలీ ఓట్ల తొలగింపుతో పోలింగ్ పర్సంటేజ్ పెరిగింది. హైదరాబాద్‌లో పోలింగ్ పర్సంటేజ్ 50 శాతం కూడా దాటడం లేదు. ఎస్ఐఆర్ పూర్తయితే ఇక్కడ కూడా పోలింగ్ పర్సంటేజ్ పెరుగుతుంది. తెలంగాణ పర్యటనకు రానున్న ప్రధాని మోడీ రైల్వే, జాతీయ రహదారి ప్రాజెక్టులను ప్రారంభిస్తారు’’ అని కిషన్ రెడ్డి తెలిపారు.
















