నవతెలంగాణ – హైదరాబాద్ : కాకినాడ గాంధీనగర్‌లో నడుచుకుంటూ వెళ్తున్న ఎపీఎస్పీ కానిస్టేబుల్ నాగేశ్వరరావుపై గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో దాడి చేసి గొంతు కోసి హత్య చేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, క్లూస్ టీమ్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్న పోలీసులు.. పాత కక్షల కారణంగానే హత్య జరిగిందా? లేక ఇతర వ్యక్తిగత కారణాలున్నాయా? అనే కోణాల్లో విచారణ చేపట్టారు.

The post గొంతు కోసి ఎపీఎస్పీ కానిస్టేబుల్ దారుణ హత్య appeared first on Navatelangana.