సాంఘీక సంక్షేమ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ 2026 -27 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ప్రవేశాల కోసం నిర్వహించే కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ టిజిఎస్‌డబ్లుఆర్‌జెసి సెట్ హాల్‌టికెట్లు విడుదల చేశారు. ఈ ప్రవేశ పరీక్ష మే 15న శుక్రవారం నిర్వహించనున్నట్లు సంస్థ వెల్లడించింది. ఈ ప్రవేశ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరూ తమ హాల్ టికెట్లు మే 5 నుండి 14 వరకు అధికారిక వెబ్‌సైట్ rjcet.telangana.gov.in నుండి డౌన్‌లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు.