
హైదరాబాద్: రాష్ట్ర కేబినేట్ సమావేశం కొనసాగుతోంది. ఈ భేటీలో కాళేశ్వరంలో లోపాలపై పిసి ఘోష్ నివేదికపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టులో సవాల్ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసురకుంది. భేటీలో మరికొన్ని కీలక అంశాలపై కూడా చర్చ జరుగుతోంది. ప్రస్తుతం నడుస్తున్న ఆర్టిసి సమ్మె, అదే విధంగా గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకం జరిపే అంశం, ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికలపైనా మంత్రి వర్గంలో చర్చించనున్నట్లు సమాచారం. ఇందిరమ్మ కుటుంబ భీమా విధానాలు, మెట్రో స్వాధీన పరుచుకోవడంతో పాటు దాని నిర్వహణపై చర్చ జరుగనున్నట్లు తెలుస్తోంది.












