బెంగళూరు: భార్య మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకోవడంతో ఇద్దరు పిల్లలను చంపి అనంతరం భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన కర్నాటక రాష్ట్రం తుమకూరు ప్రాంతంలో కునిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... అలకెరే గ్రామంలో శివణ్ణ, కావ్య అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు జీవన్(10), ప్రణీశ్(05) అనే కుమారులు ఉన్నారు. శివణ్ణ మల్లేశ్వర దేవాలయంలో పూజారిగా ఉంటూ ఓ ఫ్యాక్టరీలో పని చేస్తున్నాడు. ముగనపురా హేమంత్‌తో కావ్య అక్రమ సంబంధం పెట్టుకుంది. దీంతో దంపతుల మధ్య గత కొన్ని రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి. ఘర్షణలు తారా స్థాయికి చేరుకోవడంతో కావ్య తన పిల్లలను తీసుకొని పుట్టింటికి కురుడిహళ్లికి వెళ్లిపోయింది. దీంతో శివణ్ణ తన అత్తగారింటికి వెళ్లి పిల్లలను తీసుకొని తన సొంతూరుకు వచ్చాడు. పిల్లలను ఇద్దరిని చంపి అనంతరం అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి భార్యతో సహా ఆమె ప్రియుడును అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.