న్యూఢిల్లీ : బారత్ న్యూజిలాండ్ మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టిఎ) ఇరుదేశాలకు ఎంతో మేలు చేస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. సోమవారం ఇరుదేశాల నడుమ కీలక ఎఫ్‌టిఎ కుదిరిన తరువాత ప్రధాని మోడీ స్పందించారు. ఎఫ్‌టిఎ ఇరుదేశాల వ్మూహాత్మక భాగస్వామ్య బంధాన్ని మలుపు తిప్పుతుంది. ప్రత్యేకించి రైతులు, యువజనులు, ఎంఎస్‌ఎంఇలకు ఇతోధిక ప్రయోజనం తథ్యం అని తెలిపారు. ఇరు దేశాల పురోగమన దిశలో ఈ ఎఫ్‌టిఎ మైలురాయి అయి తీరుతుందన్నారు. ఇరుదేశాల మధ్య సోమవారం ఎఫ్‌టిఎపై సంతకాలు జరిగాయి. భారతదేశంలో పర్యటిస్తోన్న న్యూజీలాండ్ వాణిజ్య, పెట్టుబడుల మంత్రి టాడ్ మెక్‌క్లేతో భారత వాణిజ్య వ్యవహారాల మంత్రి పియూష్ గోయల్ విస్తృత చర్చల తరువాత ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఇ ప్పటి ఒప్పందంతో విద్యార్థులు, యువతకు అత్యధిక ప్రయోజ నం చేకూరేందుకు రంగం సిద్ధం అయిందని ప్రధాని మోడీ తెలిపారు. పలు స్టార్టప్‌లు వెలుస్తాయి. వృత్తి నైపుణ్య ఐటి ప్రతిభావంతులకు ఉద్యోగ ఉపాది అవకాశాలు మెరుగుపడుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటి ఎఫ్‌టిఎతో న్యూజీలాండ్‌కు భారతీయ ఎగుమతులపై నూటికి నూరుశాతం సుంకం రహిత పరిస్థితి ఏర్పడుతుంది. ఇదే విధంగా వ్యవసాయ ఉత్పత్తులు, పెట్టుబడుల అనువైన వాతావరణం నెలకొంటుందని ప్రధాని పేర్కొన్నారు.

కార్మిక రంగ ప్రోత్సాహక రంగాలైన జవుళి, లెద ర్, పాదరక్షలు, వజ్రాలు , నగలు , ఇంజనీరింగ్ సరుకులు , ప్రాసిస్‌డ్ ఫుడ్స్ రంగాలలో పరస్పర పెట్టుబడులకు సామరస్య వేదిక ఏర్పడుతుంది. అయితే విదేశీ వ్యవసాయ ఉత్పత్తుల రాకతో దేంలోని రైతు ప్రయోజనాలు దెబ్బతినకుండా పలు చర్యలు తీసుకున్నారు. అక్కడి నుంచి వచ్చే వ్యవసాయ ఉత్పత్తులపై ఎటువంటి మినహాయింపులు వెలువరించలేదు. కట్టుదిట్టమైన వ్యాపార భద్రతా చర్యలకు దిగినట్లు వాణిజ్య మంత్రి తెలిపారు. ఎఫ్‌టిఎతో మైలురాయితో పలు మేలుమలుపులు, ఐటి రంగంలో భారతీయ నిపుణులకు 5000 ప్రత్యేక వీసాలు దక్కుతాయి, సాల ఉత్పత్తులు ఉల్లిపాయలపై డ్యూటీ మినహాయింపు . దీనితో ఎగుమతులకు ఊతం న్యూజిలాండ్ పాపులర్ బ్రాండ్ వైన్స్, మద్యం విరివిగా దొరుకుతుంది. బ్లాక్‌బెర్రీలు ప్రవేశిస్తాయి, ఈ ఒప్పందం ఇరుదేశాల ప్రముఖ కంపెనీలకు ఉపయోగపడటమే కాకుండా , సామాన్య ప్రజలకు కూడా ఉపయుక్తం అవుతుంది, ఇప్పుడు పలు ఆంక్షలు వీడటంతో న్యూజిలాండ్ ఉత్పత్తులు, అనేక రకాల సరుకులు భారతీయ మార్కెట్లలోకి విరివిగా చేరుకుంటాయి, న్యూజిలాండ్‌కు చెందిన ప్రఖ్యాత రకం ఉన్ని స్వెట్టర్లు, పలు రకాల వస్త్రాలు బారతదేశంలో ఇకపై చౌకగా లభించేందుకు వీలేర్పడుతుంది.