నవతెలంగాణ – హైదరాబాద్ : మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో ఓ యువతిని గొంతు కోసి చంపిన ప్రేమోన్మాది తేజ మృతి చెందాడు. జడ్చర్లలోని ఎర్రకుంట కాలనీకి చెందిన వైష్ణవి(22)ని హైదరాబాద్కు చెందిన తేజ(28) కొన్నేళ్లుగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. అయితే ఆ యువతికి వేరే వ్యక్తితో పెళ్లి నిశ్చయమవడంతో కక్ష పెంచుకున్న తేజ.. శనివారం ఆమెను కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. స్థానికులు ఆగ్రహంతో తేజను పట్టుకుని చితకబాదారు. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తేజ చనిపోయాడు.
The post జడ్చర్లలో యువతిని హత్య.. ప్రేమోన్మాది మృతి appeared first on Navatelangana.
















