జగద్గిరి గుట్ట: మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధి సాయి నగర్ లోని రెస్క్యూ హోమ్ నుంచి ఏడుగురు మహిళల పారిపోయారు. రోడ్లపై అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఏడుగురు మహిళలను పోలీసులు రక్షించి రెస్క్యూ హోమ్ లో ఉంచారు. రెస్క్యూ హోమ్ నిర్వాహకుల కళ్ళు కప్పి అక్కడ నుంచి  సాల్మా(ఢిల్లీ), స్వేత(తెలంగాణ), కమలమ్మ(తెలంగాణ), ప్రియాంక(తెలంగాణ), సంధ్య(ఎపి), చాందిని(పశ్చిమ బెంగాల్), బీట్రైస్(కెన్యా) అనే మహిళలు పారిపోయారు. వెంటనే జగద్గిరిగుట్ట పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పారిపోయిన మహిళ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.