మనతెలంగాణ/హైదరాబాద్: జనగణనలో అందరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. జనగణన సెన్సెస్ 2027 కార్యక్రమంలో సిఎం రేవంత్‌రెడ్డి ఆదివారం పాల్గొన్నారు. సెల్ఫ్ ఎన్యుమరేషన్‌కు సంబంధించిన వివరాలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సెన్సెస్ అధికారులు వివరించారు. వైబ్‌సైట్ ద్వారా తన వివరాలను సిఎం రేవంత్‌రెడ్డి నమోదు చేసుకున్నారు.ఈ కార్యక్రమంలో డైరెక్టరేట్ ఆఫ్ సెన్సెస్ ఆపరేషన్స్ డైరెక్టర్ భారతి హోళికేరి, జిహెచ్‌ఎంసి కమిషనర్ ఆర్‌వి కర్ణన్, జాయింట్ ప్రిన్సిపల్ సెన్సెస్ ఆఫీసర్ ప్రియాంక అల, ఐ అండ్ పిఆర్ కమిషనర్ సిహెచ్ ప్రియాంక, ఇతర అధికారులు పాల్గొన్నారు.