
ఇళయ దళపతి విజయ్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్‌గా దర్శకుడు హెచ్.వినోద్ తెరకెక్కించిన సినిమా జన నాయగన్. విజయ్ ఆఖరి సినిమాగా ప్లాన్ చేసిన ఈ సినిమా విడుదలకు అనేక అడ్డంకులు ఎదురయ్యాయి. అయితే ఈ సినిమా రిలీజ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం మే 8న గ్రాండ్ గా థియేటర్స్ లో విడుదల కానున్నట్టు తెలిసింది.
అక్కడ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఈ సినిమా రానుందని సమాచారం. ఇంకోపక్క సూర్య నటించిన ‘కరుప్పు’ మే 15న రానుందట. కానీ ‘జననాయగన్’ సినిమాను మే 8నే రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. మరి దీనిపై మేకర్స్ ఏమన్నా క్లారిటీ అందిస్తారో లేదో చూడాలి. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందించగా కేవిఎన్ ప్రొడక్షన్స్ వారు భారీ బడ్జెట్‌తో నిర్మించారు.















