ఆధునిక విమర్శకులు, పరిశోధకులు పెక్కురు కౌటిల్యుని అర్థశాస్త్రాన్ని ఆదర్శంగా తీసుకొని, వాత్స్యాయనుడు కామసూత్రములను రచించినాడని తీర్మానించారు. అర్థశాస్త్రపు తొలి సంపాదకుడు రుద్రపట్నం శ్యామశాస్త్రి కౌటిల్యుని రచనలోనూ, వాత్య్సాయనుని కతిలోనూ ప్రయోగింపబడిన ఒకే రకపు పారిభాషిక శబ్దాలను, సమస్త పదాలను ఉదాహరించిన తీరును గమనిస్తే ,అర్థశాస్త్రం ముందుది. కామసూత్రాలు పిదపవి అని తేటతెల్లం అవుతుంది. కౌటిల్యుని అర్థశాస్త్ర రచన ప్రణాళికను వాత్స్యా యనుడు చక్కగా, చొక్కంగా అనుసరించాడు. కనుక కామసూత్రాలు క్రీస్తుశకం రెండవ శతకపు పూర్వార్ధం లోనిదని నిర్ధారించారు. […]

The post కామకళాశాస్త్ర గ్రంథాల పరిచయం – చరిత్ర appeared first on Navatelangana.