
ఢిల్లీ: స్నేహితుడి భార్యపై అత్యాచారం చేసిన అనంతరం ఐఆర్‌ఎస్ కూతురుపై అత్యాచారం చేసి హత్య చేసిన సంఘటన ఢిల్లీలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రాహుల్ మీనా(19) అనే యువకుడు ఐఆర్‌ఎస్ ఆఫీసర్ వద్ద ఆఫీస్ బాయ్ పని చేసేవాడు. మంగళవారం సాయంత్ర తన స్నేహితుడితో కలిసి రాహుల్ పక్క గ్రామంలో పెళ్లికి వెళ్లాడు. స్నేహితుడిని అక్కడే వదిలేసి అల్వార్‌లోని అతడి ఇంటికి రాహుల్ వెళ్లాడు. డోర్ కొట్టగానే స్నేహితుడి భార్య డోర్ తెరవడంతో ఆమెను మరో గదిలో లాక్కెళ్లి అత్యాచారం చేశాడు. అనంతరం అల్వార్ నుంచి ఢిల్లీలోని ఐఆర్‌ఎస్ ఆఫీసర్ ఇంటికి వెళ్లాడు. ఇంట్లో కూతరు ఒంటరిగా ఉండడంతో ఆమెపై అత్యాచారం చేసి హత్య చేశాడు. ఐఆర్‌ఎస్ ఆఫీసర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి అతడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. గతంలో రాహుల్ పలువరిపై అత్యాచారం చేసినట్టు ఆరోపణలు చేస్తున్నారు. కొందరు బాధితురాళ్లు పరువు పోతుందని బయటకు చెప్పుకోవడంలేదని సమాచారం. రాహుల్‌కు ఉరిశిక్ష వేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.













