
హైదరాబాద్: రెండున్నరేళ్లుగా రాష్ట్రంలో పరిస్థితులు మారిపోయాయని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. ఒక బాలికకు అన్యాయం జరిగితే ప్రభుత్వం మిన్నకుండిపోయిందని అన్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో నాబూత్- నాభవిష్యత్తు కార్యక్రమంలో బిఎల్ఎలకు బిఆర్ఎస్ శిక్షణా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కెటిఆర్ పాల్గొని మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్, బిజెపి కలిసి బాలికకు అన్యాయం చేయాలని చూశాయని విమర్శించారు. బాలికకు న్యాయం జరగాలని నిలబడి, పోరాడింది..మళ్లీ బిఆర్ఎస్ పార్టీయేనని, బిఆర్ఎస్, అనుబంధ సంఘాల పోరాటం వల్లే బాలికకు కొంత న్యాయం జరిగిందని కెటిఆర్ తెలియజేశారు. కేంద్రమంత్రి, ముఖ్యమంత్రి కలిసి పోక్సో కేసును నీరుగార్చే ప్రయత్నం చేశారని, తప్పు చేసిన వ్యక్తిని 9 రోజుల పాటు దాచిపెట్టింది కేంద్రమంత్రి కాదా? అని బండి భగీరథ్ లొంగిపోయాడా? అరెస్ట్ అయ్యాడా? అని ప్రశ్నించారు. నిందితుడిని దాచిపెట్టిన కేంద్రమంత్రిని ప్రధాని నరేంద్ర మోడీ వెంటనే బర్తరఫ్ చేయాలని కెటిఆర్ కోరారు.














