నవతెలంగాణ – ఆలేరు రూరల్ఆలేరు మండలం కొలనుపాక గ్రామానికి చెందిన పరుష లక్ష్మికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కల్యాణ లక్ష్మి పథకం కింద ఆర్థిక సహాయం అందింది. ఈ సందర్భంగా ఆలేరు శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ బిర్ల ఐలయ్య తన చేతుల మీదుగా చెక్కును అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద కుటుంబాల ఆర్థిక భారం తగ్గించడంలో కల్యాణ లక్ష్మి పథకం కీలక పాత్ర పోషిస్తోందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను వినియోగించుకోవాలని సూచించారు. […]

The post కల్యాణ లక్ష్మి చెక్కు అందజేత appeared first on Navatelangana.