
డిఫరెంట్ ఎంటర్టైనర్స్ చేస్తున్న తరుణ్ భాస్కర్... రైటర్- డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్‌తో కలిసి ’గాయపడ్డ సింహం’ తో అలరించబోతున్నారు. ఈ చిత్రాన్ని పవన్ సాదినేని స మర్పణలో, కళ్యాణ చక్రవర్తి మంథిన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉ మేష్ బన్సల్ సప్తస్వ మీడియా వర్క్, పిఓవి స్టోరీస్, జీ స్టూడియోస్ బ్యానర్ల పై నిర్మించారు. ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి కథానాయికలుగా నటించారు. జేడి చక్రవర్తి కీలక పాత్ర పోషించారు. గాయపడ్డ సింహం మే 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా యాక్టర్ జేడి చక్రవర్తి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ “కమల్ హాసన్ చేసిన క్యారెక్టర్లు ప్రపంచంలో ఎవ్వరూ చేయలేదు. అయితే ‘గాయపడ్డ సింహం’లో యాక్టర్‌గా కాదు, క్యారెక్టర్ పరంగా ఆయనకు రాని అదృష్టం నాకు వచ్చిందని భావిస్తున్నాను.
అలాంటి ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఇందులో చేశాను. -ఒకే క్యారెక్టర్ ఫస్ట్ హాఫ్‌లో ఒక షేడ్, సెకండ్ హాఫ్‌లో మరో షేడ్ ఉండటం మామూలే. కానీ ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ రెండింటిలో ఒకే విధంగా కనిపిస్తూ, రెండు షేడ్స్ లో కనిపించడం నాకు చాలా ఆనందాన్నిచ్చింది. అది ఎలా అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. కథలోనే ఆ బలం, మ్యాజిక్ కుదిరింది. -ఇందులో తరుణ్ భాస్కర్ గాయపడ్డాడు, నేను గాయపడ్డాను, ఇంకో సింహం కూడా గాయపడింది. ఆ సింహం ఎవరో త్వరలో తెలియజేస్తాం. -ఈ కథను చాలా కొత్తగా చూపించారు. ఇందులో ధర్మా క్యారెక్టర్, తరుణ్ భాస్కర్ చేసిన దరహస్, ఇంకో పాత్ర- ఇవన్నీ కలిసే విధానం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్‌కి షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లు చేసిన మంచి అనుభవం వుంది. తన స్టైల్ నాకు చాలా నచ్చింది. రియలిస్టిక్, హిలేరియస్ హ్యూమర్‌తో సినిమా తీశాడు. -ఈ సినిమాలో నా పాత్ర పేరు ‘బ్రూటల్ ధర్మ’. కానీ నేను స్క్రీన్‌పై చేసే పనులు ప్రేక్షకులకు నవ్వు తెప్పిస్తాయి”అని అన్నారు.











