
హైదరాబాద్: నగరంలోని కూకట్‌పల్లిలో దారుణం చోటు చేసుకుంది. నవదంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరికి రెండు నెలల క్రితం వివాహం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. భర్త కార్తీక్ ఉరి వేసుకోగా, భార్య మంజుల విషం తాగి బలవన్మరణానికి పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనస్థలి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మృతికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.















