బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్ కుమారుడు హీరోగా నటించిన చిత్రం ‘ఏక్ దిన్’. సునీల్ పాండే దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాతో సౌత్‌ ఇండియన్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్‌గా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తుంది. ఈ సినిమా మే 1వ తేదీన థియేటర్లలో సందడి చేయనుంది. అయితే విడుదలకు ముందు ఈ సినిమాని ప్రత్యేక షోలో అమిర్ ఖాన్ చూశారు. ఈ సినిమా చూస్తూ అమిర్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. పక్కనే ఉన్న సాయి పల్లవి అమిర్‌ను ఓదార్చే ప్రయత్నం చేసింది. అయినా కూడా ఆయనకు కన్నీళ్లు ఆగలేదు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాకి అమిర్ ఖానే నిర్మాత కావడం మరో విశేషం.