
హైదరాబాద్: ఇప్పటివరకు పిట్టల దొరను చూశారని..ఇప్పుడు పిట్టలదొరసానిని చూస్తారని బిజెపి ఎంపి ధర్మపురి అర్వింద్ తెలిపారు. మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను తామెప్పుడో మర్చిపోయామని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. సామాజిక తెలంగాణ రాలేదు కాబట్టే వాళ్లను ప్రజలు ఓడించారని విమర్శించారు. కవితకు రాజకీయ సమాధి కట్టింది బిజెపినే అని బిజెపి మద్దతు లేకుండానే తెలంగాణ వచ్చిందా? అని ప్రశ్నించారు. కవితకు మాజీ సిఎం కెసిఆర్ రోబోలా కనిపిస్తున్నారా? అని ఎంపి ధర్మపురి అర్వింద్ ప్రశ్నించారు.










