నవతెలంగాణ – హైదరాబాద్ : మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ జిల్లాలో బర్గి డ్యామ్‌లో 31 మంది పర్యాటకులతో వెళ్తున్న పడవ బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా, 15 మందిని సహాయక బృందాలు కాపాడాయి. మరికొంతమంది గల్లంతయ్యారు. పరిమితికి మించిన ప్రయాణికులు, బలమైన గాలులే ప్రమాదానికి కారణమని సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, అధికారులు రంగంలోకి దిగి గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
The post మధ్యప్రదేశ్‌లో పడవ బోల్తా.. తొమ్మిదిమంది మృతి appeared first on Navatelangana.












