
ముంబై: మహిళల టి-20 ప్రపంచకప్ ఈ ఏడాది జూలై 12 నుంచి ప్రారంభంకానుంది. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్‌కి ఇంగ్లాండ్ వేదిక కానుంది. అయితే ఈ మెగా టోర్నీలో బరిలోకి దిగే భారత జట్టును శనివారం సెలక్టర్లు ప్రకటించారు. అమితా శర్మ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ.. బిసిసిఐ కార్యదర్శి దేవ్‌జిత్ సైకియా, ప్రధాన కోచ్ అమోల్ మజుందార్, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌లతో సమావేశం అయింది. అనంతరం మెగా టోర్నీలో పాల్గొనే 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించారు.
టి-20 ప్రపంచకప్‌లో పాల్గొనే భారత జట్టు:
హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, భారతి పుల్మాలి, దీప్తి శర్మ, రిచా ఘోష్, శ్రీ చరణి, యాస్తికా భాటియా, నందిని శర్మ, అరుంధతి రెడ్డి, రేణుకాసింగ్ ఠాకూర్, క్రాంతి గౌడ్, శ్రేయాంక పాటిల్, రాధా యాదవ్.











