
చెన్నై: ఐపిఎల్‌లో భాగంగా శనివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 8 వికెట్ల తేడాతో ఘణ విజయం సాధించింది. 160 పరుగుల లక్ష్యాన్ని చెన్నై 18.1 ఓవర్లలోనే కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ 67 (నాటౌట్), కార్తిక్ శర్మ 54 (నాటౌట్) జట్టును గెలిపించారు.
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో చెన్నై బౌలర్లు సఫలమయ్యారు. ఓపెనర్ రియాన్ రికెల్టన్, వన్‌డౌన్‌లో వచ్చిన నమన్ ధిర్‌లు అద్భుత బ్యాటింగ్‌తో జట్టును ఆదుకున్నారు. రికెల్టన్ ఐదు సిక్సర్లతో 37 పరుగులు చేశాడు. నమన్ ధిర్ 3 సిక్స్‌లు, 4 ఫోర్లతో 57 పరుగులు సాధించాడు. మిగతా వారు విఫలం కావడంతో ముంబై ఆశించిన స్కోరును సాధించలేక పోయింది.













