
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా వాంఖడే వేదికగా ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో మొదట టాస్ గెలిచిన ముంబయి ఇండియన్స్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. సంజు శాంసన్ (101:54 బంతుల్లో 10 ఫోర్లు,6 సిక్స్ లు ) అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. చివరి బంతికి ఫోర్ కొట్టి సెంచరీ చేశాడు. ఈ సీజన్ లో సంజుకి రెండో సెంచరీ ఇది. ముంబయి బౌలర్లలో అశ్వని కుమార్ 2,అల్లా ఘజన్‌ఫర్ 2,జస్‌ప్రీత్ బుమ్రా, మిచెల్ శాంట్నర్ తలో వికెట్ తీశారు.













