నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణలో పదోతరగతి ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. హైదరాబాద్‌లోని ఎస్‌సీఈఆర్టీ ఆడిటోరియంలో మధ్యాహ్నం 2 గంటలకు ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు ఫలితాలను ప్రకటించనున్నారు. విద్యార్థులు వాట్సాప్ ద్వారా కూడా ఫలితాలు తెలుసుకునే అవకాశం కల్పించారు. ఇందుకోసం మధ్యాహ్నం 2:30 తర్వాత 8096958096 నంబర్‌కు ‘Hi’ మెసేజ్ పంపి రిజల్ట్స్‌ని చూసుకోవచ్చని అధికారులు తెలిపారు. లేదంటే అధికారిక వెబ్‌సైట్‌ bse.telangana.gov.in లో కూడా చెక్ చేసుకోవచ్చు.

The post నేడు పదో తరగతి ఫలితాలు విడుదల appeared first on Navatelangana.