
యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. ఇటీవల శ్రీనివాస్, కావ్య నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఇక వీరిద్దరూ కలిసి వెళ్లి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులకు పెళ్లి ఆహ్వానాన్ని కూడా అందించారు. ఇక బుధవారం ఉదయం 11 గంటల 13 నిమిషాలకి తిరుమల సన్నిధి వేదికగా సనాతన ధర్మ సంప్రదాయాల్లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్యల కళ్యాణం జరగనుంది. ఇక ఈ మహోత్సవ వేడుక అనంతరం మే 1న భాగ్యనగరంలో గ్రాండ్‌గా రిసెప్షన్‌ని నిర్వహించాలని నిర్ణయించారు.
ఈ రిసెప్షన్‌కి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు. ఇక ఈ సాంప్రదాయక వేడుకకు విశిష్టమైన హుందాతనాన్ని జోడిస్తూ... ప్రముఖ డిజైనర్ శ్రవణ్ కుమార్ వధూవరుల కోసం ప్రత్యేకమైన దుస్తులను రూపొందించారు. తిరుమల దివ్య సన్నిధిలో వధూవరుల రాజసం ఉట్టిపడేలా, ప్రాచీన భారతీయ సంప్రదాయ సౌందర్యాన్ని మరియు ఆధునిక హంగులను ఆయన తన నైపుణ్యంతో అద్భుతంగా కలబోశారని తెలిసింది.












