యంగ్ హీరో సుమంత్ ప్రభాస్ రూరల్ లవ్, ఫ్యామిలీ డ్రామా ’గోదారి గట్టుపైన’ తో అలరించబోతున్నారు. సుభాష్ చంద్ర దర్శకత్వంలో రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ నిర్మించింది. నిధి ప్రదీప్ ఈ చిత్రంలో కథానాయికగా నటించగా, జగపతి బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. బుధవారం మేకర్స్ ‘గోదారి గట్టుపైన’ నుంచి ’నేను నా పల్లెటూరు’ పాటను విడుదల చేశారు. పాట వినగానే అందమైన పల్లె జ్ఞాపకాల్లోకి తీసుకెళ్తుంది. నాగ వంశీ కృష్ణ స్వరపరిచిన ఈ మెలోడీ పల్లెటూరి మట్టి వాసన, గోదావరి తీరాల అందాన్ని అద్భుతంగా చూపించింది. రామజోగయ్య శాస్త్రి రాసిన పదాలు పల్లెటూరి ఆత్మని హత్తుకునేలా చూపిస్తున్నాయి. ఈ సాంగ్‌లో సుమంత్ ప్రభాస్ తన ఫ్రెండ్స్‌తో గడిపే సరదా క్షణాలని, పల్లెటూరి సింపుల్ లైఫ్‌ను ఎంతో సహజంగా చూపించారు. ఈ చిత్రం మే 8న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.