
- విచ్చలవిడిగా వాహనాల పార్కింగ్, ప్రమాదాలకు నిలయం..
- అటువైపు కన్నెత్తి చూడని ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీసులు, జిహెచ్ఎంసి అధికారులు
- పొద్దు పొడవక ముందే మద్యం విక్రయాలు
- ప్రేక్షక పాత్రలో ఎక్సైజ్ పోలీసులు
- నెలవారీ మామూళ్లు ఉండడం తోనే పట్టించుకోవడం లేదనే ఆరోపణలు...
మన తెలంగాణ/కాచిగూడ :
అంబర్ పేట నియోజకవర్గం వ్యాప్తంగా మద్యం దుకాణాల నిర్వాహణ ఇష్టారాజ్యంగా మారింది. నిబంధనలు పాటించ కుండా కొనసాగుతున్న మద్యం విక్రయా లపై సంబంధిత అధికారులు చూసీ చూ డనట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతు న్నారు. అధికారుల తీరుపై స్థానికులు, వాహనదారులు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. నిబంధనల పేరుతో రోడ్లపై తనిఖీలు చేస్తూ హాల్చల్ చేసే అధికారు లు మద్యం దుకాణాలపై కన్నెత్తి చూడ డం లేదంటూ మండిపడుతున్నారు. మద్యం దుకాణాల నుంచి నెలవారీ మా మూళ్లు ఉండడంతోనే ఇలా వ్యవహరి స్తున్నారనే ఆరోపణలు వెలువెత్తుతు న్నాయి.
విచ్చలవిడిగా పార్కింగ్..
అంబర్ పేట నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో మద్యం దుకాణాల ముందు వాహనాల పార్కింగ్ నిర్వహణ అస్తవ్య స్తంగా మారింది. మందుబాబులు విచ్చ లవిడిగా రోడ్డుపై వాహనాలను నిలుపు తున్నా పట్టించుకునే వారు కరువయ్యా రు. చాలా మద్యం దుకాణాలకు పార్కిం గ్ సౌకర్యం లేదు. అంబర్ పేట చౌరస్తా నుంచి రామంతపూర్ వెళ్లే దారిలో పక్క పక్కనే రెండు దుకాణాలు, కల్లు కాంపౌం డ్ ఉండడంతో భారీ విక్రయాలను కొనసా గుతున్నాయి. ఇలాంటి దుకాణాల వద్ద ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతుంది. అయి నా ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీసులు, జిహె చ్ఎంసి అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదు. దుకాణాల ముం దు నుంచి నిత్యం రాకపోకలు సాగించే భారీ వాహనాలకు ఇబ్బందులు తలెత్తు తున్నాయి.
నిత్యం సాయంత్రం, రాత్రి వేళల్లో.. జాతరే.. జాతర..
నిత్యం సాయంత్రం, రాత్రి వేళల్లో మద్యం దుకాణాలు జాతరను తలపిస్తున్నాయి. దీంతో మందు బాబులతో వివిధ ప్రాంతా లు బీజీగా మారుతున్నాయి. నల్లకుంట తిలక్ నగర్ చౌరస్తా నుంచి శివం రోడ్డు మీదుగా ఎన్.సి.సి.గేట్ వరకు వెలిసిన మూడు మద్యం దుకాణాలు ముందు, ప్రతి రోజు రద్దీ ఎక్కువగా ఉంటుంది. గోల్నాక కూరగాయల మార్కెట్ సమీపం లో ఉన్న మద్యం దుకాణాల వద్ద అసలే ఇరుకు ఈ రోడ్డు వద్ద ప్రతి రోజూ ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతుందనీ ప్రయాణికు లు, స్థానికులు వాపోతున్నారు. అదే విధంగా కాచిగూడలోని రైల్వే స్టేషన్ రోడ్డు నుంచి వీర్ సవర్కర్ చౌరస్తా వరకు ప్రతిరోజు ట్రాఫిక్ సమస్య ఉత్పన్న మవు తుందని ఇటువైపు ఎవరో కన్నెత్తి చూడ రని ప్రయాణికులు, స్థానికులు వాపోతు న్నారు. దీంతో సాయంత్రం, రాత్రి వేళల్లో ఈ రహదారిపై ప్రయాణించడానికి స్థాని కులు జంకుతున్నారు. అంతే కాకుండా దుకాణాల ముందు రోడ్డుపై వాహనాల ను అడ్డదిడ్డంగా పార్కింగ్ చేస్తుండడం గమనార్హం.
24 గంటలు బెల్ట్ షాపుల్లో విక్రయాలు..
కాచిగూడ ఎక్సైజ్ పోలీసు స్టేషన్ పరిధి లో బెల్టు షాపులు మూడు పూలు ఆరు కాయలుగా నడుస్తున్నాయి. పొద్దు పొడ వక ముందే మద్యం అందుబాటులోకి వస్తోంది. 24 గంటలు మద్యం లభిస్తుండ టంతో పేదల జీవితాలు మరింత దిగ జారిపోతున్నాయి. కాచిగూడ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోల్నాక, కమా లానగర్, లంక బస్తీలు, గంగానగర్, శంక ర్ నగర్, సత్యా నగర్, రత్ననగర్, కృష్ణా నగర్, సంజయ్ గాంధీ నగర్, నరేంద్ర నగర్, న్యూ పటేల్ నగర్, శివానంద్ నగర్ తదితర బస్తీల్లో బెల్టు షాపుల దందా జోరుగా సాగుతుంది. దీంతో రోజువారి కూలీలు నిద్ర లేవగానే బెల్టు షాపుల బాట పడుతున్నారు. పట్టించు కోవాల్సిన ఎక్సైజ్ పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. బెల్ట్ షాపులు ఉన్న ప్రాం తాల్లో మందు బాబుల వీరంగం రోజు రోజుకూ పెరుగుతోంది. మందుబాబులు, యువత బెల్ట్ షాపుల బాట పడుతు న్నారని తల్లి తండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి, నిబంధనలకు తూట్లు పొడుస్తున్న మద్యం దుకాణాలు, బెల్ట్ షాపులపై చర్య లు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
బెల్ట్ దుకాణాలపై కఠిన చర్యలు తీసుకుంటాం :
-కాచిగూడ ఎక్సైజ్ సీఐ శ్రీధర్..
బెల్ట్ దుకాణాలు పెట్టుకొని మద్యం అమ్మేందుకు ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు ఉండవు.
గతంలో ఈ విషయంపై ఎన్నో ఫిర్యాదులు వచ్చాయి. వ్యాపారులు నిబంధనలకు విరుద్ధంగా అమ్మకాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటాం.
రోడ్డుపై వాహనాలు పార్కింగ్ చేస్తే చర్యలు తీసుకుంటాం : ట్రాఫిక్ సిఐలు
ఈ విషయాన్ని కాచిగూడ ట్రాఫిక్ ఇన్స్ స్పెక్టర్ బి.వీర కౌశిక్, ఓయూ ట్రాఫిక్ సిటీ ఇన్స్ స్పెక్టర్ సత్య నారాయణల వద్ద ప్రస్తావించగా.. ట్రాఫిక్ నియంత్రణపై ఎప్పటికప్పుడు దృష్టి సారిస్తున్నామని చెప్పారు. త్వరలోనే స్పెషల్ డ్రైవ్ చేపడ తామన్నారు. మద్యం దుకాణాల ముం దు రోడ్డుపై వాహనాల పార్కింగ్ చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు.











