
విరూపాక్ష వంటి బ్లాక్‌బస్టర్ విజయంతో ఫుల్ జోష్‌లోకి వచ్చిన హీరో సాయి దుర్గ తేజ్, ఆ తర్వాత కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం తేజ్ తన కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సం బరాల ఏటి గట్టు చిత్ర షూటిం గ్‌లో బిజీగా ఉన్నా రు. దాదాపు ఏడాది కాలంగా నిర్మాణంలో ఉన్న ఈ సినిమా కథ ఎంపిక నుంచి క్యారెక్టరైజేషన్, ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్ వరకు ప్రతి అంశంలోనూ తేజ్ కష్టపడుతున్నాడని తెలిసింది. హీరో సాయి దుర్గ తేజ్ చేతిలో ఇప్పటికే పలు ఆసక్తికరమైన ప్రాజెక్టులు ఉన్నాయి. దర్శకుడు సుజీత్‌తో పాటు సందీప్ తో కూడా కొత్త సినిమాలు చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. వీటితో పాటు మరో రెండు ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయని వినికిడి. సంబరాల ఏటి గట్టు విడుదలైన వెంటనే ఆ కొత్త ప్రాజెక్టులపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. ఇక నటుడిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా మారేందుకు ఆయన సిద్ధమవుతున్న ట్లు సమాచారం. విజయ్ దుర్గ ప్రొడక్షన్స్ పేరుతో కొత్త బ్యానర్ ప్రారంభించేందుకు తేజ్ రెడీ అవుతున్నారట. త్వరలోనే ఆ నిర్మాణ సంస్థపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందని తెలిసింది. ఆ బ్యానర్ మొదటి సినిమాలో తేజ్ స్వయంగా హీరోగా నటిస్తారా? లేక కొత్త టాలెంట్ ను ప్రోత్సహించేందుకు నిర్మాణ సంస్థను ప్రారంభిస్తున్నారా? అన్నది తెలియాల్సి ఉంది.













