ముంబయి: బంధువులతో కలిసి బిర్యానీ తిన్నం తరువాత ఓ కుటుంబ సభ్యులు పుచ్చకాయ తినడంతో ఒకే ఇంట్లో నలుగురు మృతి చెందిన సంఘటన మహారాష్ట్రాలోని ముంబయిలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.... పైధోనీలో అబ్దుల్లా కాదర్(40), నస్రీన్(35) అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఆయేషా(16), జైనాబ్(12)లు ఉన్నారు. కాదర్ మొబైల్ షాపు నిర్వహిస్తున్నాడు. బంధువుల ఇంట్లో వేడుక ఉండడంతో అబ్దుల్లా కుటుంబం వెళ్లింది. వింధులో బిర్యానీ తరువాత ఇంటికి వచ్చారు. రాత్రి ఒంటి గంట సమయంలో పుచ్చకాయ తిన్నారు. ఆదివారం ఉదయం ఐదు గంటల వాంతులు, విరేచనాలు కావడంతో వారు స్థానిక ఆస్పత్రికి వెళ్లారు. అప్పటికే వారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నలుగురు మృతి చెందారు. ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఫుడ్ పాయిజన్‌తోనే చనిపోయి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.