
దుబాయ్: యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్ (యుఎఇ) సంచలన నిర్ణయం తీసుకుంది. ఒపెక్ , ఒపెక్ ప్లస్ దేశాల కూటమి నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించింది. మే1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని తెలియజేసింది. అయితే చమురు దేశాల కూటమికి, దానికి నాయకత్వం వహిస్తున్న సౌదీ అరేబియాకు యూఏఈ నిర్ణయం పెద్ద దెబ్బగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఆర్గనైజేషన్ ఆఫ్ ది పెట్రోలియం ఎక్స్‌పోర్టింగ్ కంట్రీస్‌లో చాలా ఏళ్లుగా యూఏఈ సభ్యదేశంగా ఉంది. ఒపెక్ ఏర్పాటైన ఏడేళ్ల తరువాత 1967లోయూఏఈ అందులో చేరింది. సౌదీ అరేబియా, ఇరాక్ తరువాత మూడో అతిపెద్ద చమురు ఎగుమతిదారుగా ఉంది. ఇప్పుడు కూటమి నుంచి వైదొలగడానికి కారణాలను మాత్రం వెల్లడించలేదు.











