
చెన్నై /కోల్‌కతా : రెండు కీలక రాష్ట్రాలు తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో గురువారం అత్యంత కీలకమైన ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. రెండు రాష్ట్రాల్లోనూ అత్యధిక స్థాయిలో ఓటింగ్ రికార్డు అయింది. రెండు రాష్ట్రాల ఎన్నికల ఓట్ల ఘట్టంలో భాగంగా తమిళనాడులో ఒకే దఫాలో పోలింగ్ ముగిసింది సాయంత్రం ఏడు గంటల వరకూ పాగిన పోలింగ్‌లో ఇక్కడ 84.98శాతం ఓటింగ్ పోలింగ్ నమోదైంది. రెండు దఫాల ఎన్నికలు జరిగే పశ్చిమ బెంగాల్‌లో తొలి రౌండ్ పో లింగ్‌లో 91.78శాతం ఓట్లు పోలయ్యాయి. ఎర్ర టి ఎండలు, కోస్తా తీర ప్రాంతాలలో వడగాడ్పులను లెక్కచేయకుండా ఇరు రాష్ట్రాల్లోనూ బారీ సంఖ్యలో ఉదయం నుంచే జనం ఓటేసేందుకు బారులు తీరారు. అత్యధిక స్థాయి పోలింగ్ ఎటువైపు ఫలితానికి దారితీస్తుందో అనే అంచనాలతో ప్రత్యర్థి పార్టీలు లెక్కలకు దిగుతున్నాయి. తమిళనాడులో డిఎంకె అధికారంలో ఉంది. ఇక్కడ ఇ ప్పుడు త్రిముఖ పోటీ నెలకొంది. బెంగాల్‌లో మే నాలుగవ తేదీన రెండో విడత పోలింగ్‌తో ఎన్నికల ప్రక్రియ పరిసమాప్తం అవుతుంది.
ఇక్కడ ప్రధాన పోటీ అధికార టిఎంసి, ఇక్కడి ప్రతిపక్షం బిజెపి మధ్యనే తీవ్రస్థాయిలోనే ఉంది. తమిళనాడులో జరిగిన పోలింగ్ మొత్తం మీద దాదాపుగా ప్రశాంతంగా ముగిసింది. చెన్నైలో దాదాపుగా 82 శా తం ఓట్లు పోలయ్యాయని, ఇప్పటివరకూ తమకు అందిన సమాచారం మేరకు ఇక్కడ ఇదే అత్యధిక ఓటింగ్ అని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. బెంగాల్‌లోని దక్షిణి దినాజ్‌పూర్‌లో అత్యధికంగా 93 శాతానికి పైగా ఓట్లు పోలయ్యాయి. ఇది ఇటీవలి కాలంలో ఎప్పుడూ లేని రికార్డు అయింది. అయితే ఎన్నికల సంఘం అధికారులు సాయంత్రం ఐదు గంటల వరకూ జరిగిన పోలింగ్‌నే తెలిపారు. అయితే పోలింగ్ సమయం ఆరుగంటల దాకా ఉండటంతో, అప్పటికే క్యూలైన్‌లలో ఉన్న వారికి ఎంత సేపు అయినా ఓట్లు అవకాశం ఇస్తారు. దీనితో ఇరురాష్ట్రాల్లోనూ పోలింగ్ శాతం జాతీయ స్థాయిలోనే అత్యధిక రికార్డు అవుతుందని ఎన్నికల సంఘం అనధికారికంగా విశ్లేషించింది. తమిళనాడులో మొత్తం 234 స్థానాలు ఉన్నాయి. బెంగాల్‌లో తొలివిడతలో భాగంగా 152 స్థానాలకు పోలింగ్ జరిగింది. ఈ రాష్ట్రంలో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. పశ్చి మ బెంగాల్‌లో అధికార టిఎంసి సర్ వ్యతిరేక నినాదం, మమత బెనర్జీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు,
ప్రత్యేకించి బెంగాలీ గుర్తింపు అంశాలతో రంగంలోకి దిగింది. ఇక బలీయ రీతిలోనే ఉన్న బిజెపి ఇక్కడ మమత హయాంలో అవినితీ జరిగిందని, అక్రమ చొరబాట్లు దేశ భద్రతకు సవాలు విసిరాయని ఎదురుదాఇకి దిగింది. తమిళనాడు లో అధికార డిఎంకె సారధ్యంలో నెలకొన్న సెక్యులర్ ప్రొగ్రెసివ్ అలయెన్స్ (స్పా)తో అన్నాడిఎంకె, బిజెపి ఇతర పార్టీల ఎన్‌డిఎ తలపడుతోంది. ఇప్పటివరకూ రెండు కూటముల మధ్యనే ఉన్న పోటీ ఇప్పుడు హీరో విజయ్ పార్టీ టివికె రాకతో త్రిము ఖం అయింది. ఈ పార్టీ ఓట్లను చీల్చగల్గుతుం దా? తన సత్తా చాటుకుంటుందా? అనేది ఫలితాలతోనే తేలాల్సి ఉంది. పశ్చిమ బెంగాల్‌లో ఇప్పు డు .నమోదైన 92 శాతానికి పైగా పోలింగ్ 1947 తరువాతి నుంచి చూస్తే అత్యధిక స్థాయి అని నిర్థారించారు. రెండు రాష్ట్రాలలో రికార్డు స్థాయిలో ఓటింగ్ జరిగినట్లు, పోలింగ్ సమయానికి క్యూ లో ఉన్న వారికి ఓటేసే అవకాశం కల్పించినట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి జ్ఞానేశ్ కుమార్ ఢిల్లీలో ఎన్నికల సంఘం కార్యాలయం నుంచి ప్రకటించారు.
బెంగాల్‌లో టిఎంసి, బిజెపి కార్యకర్తల ఘర్షణలు
ఇప్పుడు పోలింగ్ దశలో ఉత్తర బెంగాల్‌లోని ప లు నియోజకవర్గాలలో టిఎంసి, బిజెపి కార్యకర్త ల మధ్య ఘర్షణలు జరిగాయి. కొన్ని చోట్ల పోటీ లో ఉన్న అభ్యర్థులపై దాడులు, పోలింగ్ కేంద్రాల వద్ద పరస్పర కుమ్ములాటలు జరిగాయి. ముర్షీదాబాద్‌లో హింసాత్మక ఘటనలు జరిగాయి. అక్కడ ఎజెయుపికి చెందిన హుమామున్ కబీర్ మద్దతుదార్లు, టిఎంసి కార్యకర్తలకు మధ్య బాహాబాహి జరిగింది. ఇక దక్షిణ దినాజ్‌పూర్‌లో బిజెపి అభ్యర్థిపై దాడి జరిగిందనే వార్తలు వెలువడ్డాయి. అయితే ఘర్షణలు, దాడుల పరస్పర ఆరోపణలపై తాము సరైన నిర్థారణ తరువాత, స్థానిక నివేదికల తరువాత స్పందిస్తామని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు.










