
ఇస్లామాబాద్: గత రెండేళ్లలో తాము సాధించిన ఆర్థిక పురోగతిపై అమెరికాఇరాన్ యుద్ధం తీవ్ర ప్రభావం చూపిందని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ యుద్ధం కారణంగా దేశ చమురు దిగుమతి బిల్లు 300 మిలియన్ డాలర్ల నుంచి 800 మిలియన్ డాలర్లకు పెరిగిపోయిందని , ఇది ఆర్థిక వ్యవస్థప పెనుభారం మోపుతోందని కేబినెట్ సమావేశంలో ఆయన తెలిపారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడానికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు.
దౌత్యమార్గాల ద్వారా ఇరాన్-అమెరికా చర్చలు
పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి తాహిర్ ఆంద్రాబి మాట్లాడుతూ ,దౌత్యమార్గాల ద్వారా ఇరు వర్గాలతో చర్చిస్తున్నామని, శాంతి నెలకొంటుందని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. వారాంతపు సమీక్షలో ఆయన మాట్లాడారు. ఇరాన్‌అమెరికా మధ్య రెండోసారి చర్చలు ఇంకా కార్యరూపం దాల్చని నేపథ్యంలో ఆయన ప్రకటన వెలువడింది.















