
భోపాల్: ప్రేమ జంట పారిపోవడంతో యువకుడి తండ్రిని తీవ్రంగా కొట్టి అనంతరం అతడితో మూత్రం తాగించిన సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం రైసెన్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... అగరియా మార్ఖో గ్రామంలో బిహారీ బంజారా అనే వృద్ధుడు(70) తన కుమారుడితో కలిసి ఉంటున్నాడు. విధిషా జిల్లాలోని శంషాబాద్‌కు చెఇని ఓ మహిళతో బంజారా కుమారుడు ప్రేమలో పడ్డాడు. ప్రేమ జంటలో పారిపోవడంతో బంజారా అనే వృద్ధుడిని మహిళ కుటుంబ సభ్యులు శ్యామ్‌లాల్, మల్ఖాన్, రోడ్జీ, బీరన్, లక్ష్మణ్‌లు కిడ్నాప్ చేసి చితకబాదారు. అనంతరం ఆ వృద్ధుడితో మూత్రం తాగించడంతో పాటు వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.













