
అమరావతి: పెట్రోల్, డీజిల్ సరఫరాలో చిన్న పాటి లోపాలు మాత్రమే ఉన్నాయని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఇబ్బంది సమయంలో కంపెనీలు సమర్ధవంతంగా పనిచేయాలని అన్నారు. కొరత సృష్టించి వినియోగదారులకు అసౌకర్యం తగదని, చమురు కంపెనీలు, డీలర్లతో అధికారుల వీడియో కాన్ఫరెన్స్ జరిపారు. వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి నాదెండ్ల మనోహర్, కమిషనర్ కన్నబాబు, డీలర్ల సంఘం ప్రతినిధులు, చమురు కంపెనీలు పాల్గొన్నారు. రేపు ఉ.6 లోగా అన్ని పెట్రోల్ బంకులకు డీజిల్, పెట్రోల్ సరఫరా చేయాలని ఆదేశించారు. ఎక్కడా సరఫరా లో సమస్యలు లేకుండా చూడాలని, అధిగమించాల్సిన బాధ్యత కంపెనీలపై ఉందని సూచించారు. చమురు కంపెనీల డిపోల వద్దకు వెళ్లి జెసిలు తనిఖీ చేయాలని, సరఫరాలో ఎక్కడా ఆలస్యం లేకుండా పర్యవేక్షించాలని అధికారులకు ఆదేశించారు. సోషల్ మీడియాలో అనవసరమైన ప్రచారం చేస్తున్నారని నాదెండ్ల మనోహర్ విమర్శించారు.












