
మే డే సందర్భంగా పంజాబ్‌లో ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించారు. అయితే ఈ సమావేశాల్లో రచ్చ జరిగింది. పంజాబ్ సిఎం భగవంత్ మాన్ మద్యం సేవించి అసెంబ్లీకి వచ్చారని ప్రతిపక్ష సభ్యులు ఆరోపించారు. ఆయన మాట్లాడుతూ పలు మార్లు తడబడ్డారని అన్నారు. సభ్యులందరికీ బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయించాలని స్పీకర్‌ను కోరారు. సిఎం ప్రజల సమక్షంలో డోప్ టెస్ట్ చేయించుకోవాలని డిమాండ్ చేశారు. అయితే ఈ డోప్ పరీక్ష డిమాండ్‌ను స్పీకర్ తిరస్కరించారు. ప్రతిపక్షాల నిరసనలతో సిఎం భగవంత్ మాన్ స్పందించారు. ఈ సమావేశం కార్మిక దినోత్సవం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిందని.. దయచేసి సభ్యులంతా సభా మర్యాద పాటించాలని కోరారు.














