న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. గత మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ చేతిలో ఢిల్లీ ఘోర పరాజయాన్ని ఎదురుకుంది. దీంతో ఈ మ్యాచ్‌లో తిరిగి పుంజుకోవాలని భావిస్తోంది. మరోవైపు వరుస విజయాలతో దూసుకుపోతూ.. పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉన్న పంజాబ్ అదే జోరును ఈ మ్యాచ్‌లోనూ కొనసాగించాలని అశిస్తుంది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతున్నాయి.

తుది జట్లు:

డిసి: కెఎల్ రాహుల్ (కీపర్), పాతుమ్ నిస్సాంక, సమీర్ రిజ్వీ, అక్షర్ పటేల్ (కెప్టెన్), నితిష్ రాణా, ట్రిస్టన్ స్టబ్స్, లుంగి ఎంగిడి, కుల్దీప్ యాదవ్, టి నటరాజన్, ముకేశ్ కుమార్.

పిబికెఎస్: ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (కీపర్), ప్రియాంశ్ ఆర్య, కూపర్ కన్నోల్లి, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), శశాంక్ సింగ్, మార్కస్ స్టొయినస్, మార్కో యాన్సన్, జేవియర్ బ్రార్ట్‌లెట్, విజయ్ కుమార్ వైశ్యక్, అర్ష్‌దీప్ సింగ్, యుజవేంద్ర చాహల్.