
వనస్థలిపురంలో అధిక వడ్డీ ఆశ చూపి దాదాపు రూ.25 కోట్లకు పైగా వసూలు చేసి పరారైన రియల్ చీటర్ బద్దం జ్యోతిరెడ్డి (40) అనే మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కమలానగర్‌లో నివసించే ఆమె ప్రజలను నమ్మించి తన ఇంటిని సైతం ఇద్ద రికి అమ్మినట్లు (డబుల్ రిజిస్ట్రేషన్) ఆరోపణలు రావడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బద్దం జ్యోతిరెడ్డిని అరెస్ట్‌ను గోప్యంగా ఉంచు తున్నారు. నగర శివారు ప్రాంతంలోని ఓ పోలీస్ స్టేషన్ లో రహస్యంగా విచారిస్తున్నట్లు తెలిసింది. కేసుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. వన స్థలిపురం డివిజన్ కమలానగర్‌లో ఉండే బద్దం జ్యోతిరెడ్డి వనస్థలిపురం, హయత్‌నగర్ ప్రాంతాల్లో పలువురు రియల్టర్లు, రాజకీయనాయకులతో పరిచయాలు పెంచుకుంది.
పలువురి వద్ద 10 శాతం వడ్డీ ఇస్తానని చెప్పి అప్పులు చేసింది. ముందుగా వడ్డీ క్రమం తప్పకుండా ఇవ్వడంతో చాలా మంది అప్పులు ఇచ్చారు. దాదాపు రూ.25 కోట్లకు పైగానే వసూలు చేసి పరారైంది. అదే క్రమంలో రూ.3 కోట్లు అప్పుగా తీసుకున్న సుజిత్ అనే వ్యక్తికి కమలానగర్‌లోని తన సొంత ఇంటిని సేల్ అగ్రిమెంట్ చేసింది. ఆ తర్వాత ఇబ్రహీంపట్నం ప్రాంతానికి చెందిన రామకృష్ణారెడ్డికి కూడా సేల్‌డీడ్ చేసింది. అగ్రిమెంట్ చేసుకున్న సుజిత్ బంధువులు ఆ ఇంట్లో ఉంటున్నారు. ఈ ఇంటిని తమకు అమ్మారని, ఖాళీ చేసి వెళ్లాలని రామకృషా ్ణరెడ్డి అనే వ్యక్తి వచ్చి సుజీత్ కుటుంబ సభ్యులకు చెప్పడంతో బద్దం జ్యోతిరెడ్డి మోసం బయటపడింది. అయితే ఆ ఇద్దరు ఇల్లు తమదంటే తమదని ఘర్షణకు దిగడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. కానీ ఇద్దరి వద్ద డబ్బులు తీసుకున్న బద్దం జ్యోతిరెడ్డి పరారైంది.













