
మన తెలంగాణ/హైదరాబాద్ : కేవలం గొర్రెల కాపరులను చెట్లు నరకవద్దని అభ్యర్థిస్తున్న నిజమైన ప్రకృతి ప్రేమికులు దుశ్చర్ల సత్యనారాయణపై జరిగిన దాడి జరగడంపై గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త, పర్యావరణ పరిరక్షకులు, జంతు ప్రేమికులు, మాజీ ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. విచారకరమైన విషయం ఏమిటంటే, ఈ ఘటన జరిగిన అదే 70 ఎకరాల అడవిని ఆయనే పోషించి, సంరక్షిం చారని వెల్లడించారు. కొన్ని సార్లు మాటల కన్నా కళే గొప్పగా మాట్లాడుతుందనే కఠోర వాస్తవాన్ని కళ్ళకు కట్టిన సిహెచ్.మృత్యుంజయ శక్తివంతమైన కార్టూన్‌ను పంచుకున్నారు. ఇటువంటి చర్యలు ఆమోదయోగ్యం కావని, వీటిని కఠినంగా ఎదు ర్కోవాలని, సత్యనారాయణ త్వరగా కోలుకోవాలని మాజీ ఎంపి సంతోష్ ఆకాంక్షించారు. న్యాయం తప్పక గెలవాలని ఆయన అభిలషించారు.











