కోల్ కత్తా : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. తొలి విడతలో 152 నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. తొలివిడతలో 40 వేలకు పైగా పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. మొత్తం 3.6 కోట్ల మందికి పైగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో 1,75 కోట్ల మంది మహిళలున్నారు. తొలివిడత బరిలో 1,478 మంది అభ్యర్థులు పోలింగ్ లో పాల్గొన్నారు. తొలివిడతలో భవానీ పూర్ నుంచి పశ్చిమ బెంగాల్ సిఎం మమతా బెనర్జీ, బిజెపి లోక్ సభ సభ్యుడు సువేందు అధికారి పోటీ చేశారు. బెంగాల్ రెండో విడతలో 142 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 29న పోలింగ్ జరగనుంది. పోలింగ్ నేపథ్యం లో ఎక్కడా  అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఇసి పటిష్ట చర్యలు ఏర్పాటు చేశారు. తమిళనాడులో మొత్తం 234 స్థానాల్లో ఓటింగ్ ప్రారంభమైంది. 5.73 కోట్ల మంది ఓటర్లు 4,023 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. ఓటర్లలో 2.93 కోట్ల మంది మహిళలు, 2.83 కోట్ల మంది పురుషులున్నారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది.