
కోల్ కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తుది విడత పోలింగ్ మొదలైంది. రాష్ట్రంలోని 7 జిల్లాల్లోని 142 నియోజకవర్గాల్లో తుది విడత పోలింగ్ జరుగుతుంది. ఈ పోలింగ్ ప్రక్రియ కోసం మొత్తం 41,001 పోలింగ్ కేంద్రాలను అధికారులు సిద్ధం చేశారు. ఈ తుది విడతలో మొత్తం 3 కోట్ల 21 లక్షల 73 వేల మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. సుమారు 2,321 కంపెనీల కేంద్ర బలగాలను క్షేత్రస్థాయిలో మోహరించాయి. భవానీపూర్ నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బిజెపి సువేందు అధికారి పోటీ చేస్తున్నారు. మొత్తం 294 అసెంబ్లీ స్థానాలు ఉండగా తొలి దశలో 152 రెండో దశలో 142 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది.













