పశ్చిమ బెంగాల్‌లో శనివారం మే 2న అసెంబ్లీ స్థానాలకు చెందిన 15 పోలింగ్ బూత్‌లలో రీపోల్ జరుగుతుంది. ఈ మేరకు ఎన్నికల సంఘం ఆదేశాలు వెలువడ్డాయి. ఎన్నికల అక్రమాల ఆరోపణలు రావడంతో వివాదానికి తెరదించేందుకు ఇక్కడ రీ పోల్‌కు దిగుతున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకూ పోలింగ్ నిర్వహిస్తారుఇప్పుడు రీ పోలింగ్ జరిగే కేంద్రాలు సౌత్ 24 పరగణా జిల్లాలోని డైమండ్ హార్బర్, మగ్రహాట్ పశ్చిమ అసెంబ్లీ స్థానాల పరిధిలో ఉన్నాయి. ఇక ఫల్తా పోలింగ్ స్టేషన్‌లో కూడా అక్రమాల ఫిర్యాదులు అందాయి. అయితే ఇక్కడ రీ పోలింగ్‌పై ఇసి నిర్ణయం వెల్లడికావల్సి ఉంది.