కోల్‌కతా: బుధవారం పశ్చిమబెంగాల్‌ ఎన్నికల్లో రెండో దశ పోలింగ్ జరుగుతోంది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు భారీ స్థాయిలో తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. దాంతో మధ్యాహ్నం ఒంటి గంటకే 61.11 శాతం పోలింగ్ నమోదైంది. హావ్‌డా ఉత్తర్‌లో 63.16 శాతం ఓటింగ్ రికార్డయింది. బారక్‌పుర్‌లో 61 శాతం మందికిపైగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. డైమండ్ హార్బర్, భవానీపుర్, సందేశ్‌ఖాలీ, దమ్‌దమ్‌లోనూ 50 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది.