
సిక్కిం రాజధాని గ్యాంగ్‌టక్‌లో ప్రధాని మోడీ కాసేపు సందడి చేశారు. యువతతో కలిసి ఫుట్‌బాల్ ఆడుతూ ఉల్లాసంగా గడిపారు. సిక్కిం రాష్ట్ర అవతరణ జరిగి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అక్కడ వేడుకలు నిర్వహిస్తునారు. గోల్ కొట్టి మిగతా క్రీడాకారులతో మోడీ సంబరాలు చేసుకుటున్న వీడియో వైరల్‌గా మారింది. ఈ సందర్భంగా తీసిన ఫొటోలు, వీడియోలను ప్రధాని తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకోవడంతో వైరల్ అయ్యాయి. యువతతో కలిసి క్రీడల్లో పాల్గొనడం తనకు ప్రత్యేక అనుభూతినిచ్చిందని ప్రధాని మోడీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ’గ్యాంగ్‌టక్‌లో ఉదయం యువ స్నేహితులతో కలిసి ఫుట్‌బాల్ ఆడడం ఎంతో శక్తినిచ్చింది’ అని మోడీ పేర్కొన్నారు.
అనంతరం సిక్కింలో ప్రధాని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. వివిధ రంగాల్లో రూ.4,000 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించారు. తమ ప్రభుత్వం యాక్ట్ ఈస్ట్, యాక్ట్ ఫాస్ట్ పాలసీకి కట్టుబడి ఉందన్నారు. 8 ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిలో రాజీ పడబోమని చెప్పారు. మరోవైపు ప్రధాని మోడీ ఫుట్‌బాల్ ఆడడంపై విపక్షాలు విమర్శలు గుప్పించాయి. పశ్చిమ బెంగాల్‌లో చివరి విడత పోలింగ్ నేపథ్యంలో ఆయన జిమ్మిక్కులకు దిగారని ఆరోపించాయి. బెంగాల్‌లో ఫుట్‌బాల్‌కు విపరీతమైన క్రేజ్ ఉంటుందని, ఓటర్లను ఆకట్టుకునేందుకు మోడీ ఇలాంటివి చేస్తుంటారని మండిపడ్డాయి.













