హైదరాబాద్: మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిత్రం ‘పెద్ది’. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో విలేజ్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కింది. అయితే పలు కారణాల వల్ల ఈ సినిమా విడుదల వాయిదా పడుతూ వస్తోంది. దీంతో అభిమానులకు నిరాశే ఎదురవుతోంది. కాగా, తాజాగా సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా జూన్ 4న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది.

ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాలో కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు తదితరులు కీలక పాత్రలు పోషించారు. కోలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతి హాసన్ ఈ సినిమాలో స్పెషల్ సాంగ్‌లో చిందులు వేసింది. ఇప్పటికే ఈ సాంగ్ షూటింగ్ కూడా పూర్తయింది. ఎఆర్ రహమాన్ ఈ సినిమాకు సంగీతం అందించారు. దీంతో ఇక సినిమాకు సంబంధించిన మిగితా పనులు పూర్తి చేసుకొని పెద్ది రిలీజ్‌కి రెడీ అవుతోంది. దీంతో చరణ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.