
హైదరాబాద్: కవిత పార్టీ పెట్టినందుకు టిపిసిసి అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అభినందనలు తెలిపారు. మాజీ ఎమ్మెల్సీ కవిత తన కొత్త పార్టీ పేరును తెలంగాణ రాష్ట్ర సేన(టిఆర్ఎస్)గా ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. బిఆర్ఎస్ దోపిడీలో కవితకు భాగస్వామ్యం ఉందని ఆరోపించారు. దోపిడీపై కవిత వివరణ ఇవ్వడం లేదని.. సిఎం రేవంత్‌పై కవిత వ్యాఖ్యలు అర్థరహితమని అన్నారు. కాంగ్రెస్ పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని.. కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఎన్ని పార్టీలు వచ్చినా.. కాంగ్రెస్‌కి తిరుగులేదని స్పష్టం చేశారు. కెసిఆర్ చుట్టు ఉన్న గుంటనక్కల విషయం పదేళ్లలో కవితకు తెలియదా? అని ప్రశ్నించారు. కెటిఆర్‌కు రాజకీయం తెలియదన్న కవిత వ్యాఖ్యల్లో నిజం ఉండొచ్చని.. రాజకీయాల్లో ఆశ ఉండాలి, అత్యాశ ఉండకూడదు అని పేర్కొన్నారు.













