
రాష్ట్ర నూతన డిజిపిగా సివి ఆనంద్ నియమితులయ్యారు. ప్రస్తుత డిజిపి శివధర్ రెడ్డి ఈ నెల 30j ఉద్యో గ విరమణ పొందనున్న నేపథ్యంలో సివి ఆనంద్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త డిజిపిగా సివి ఆనంద్ మే 1వ తేదిన బాధ్యతలు స్వీక రించనున్నారు. సివి ఆనంద్ 1991 బ్యాచ్ కు చెందిన వ్యక్తి కాగా ఆయన తర్వాత సీనియార్టీ జాబితాలో 1994 బ్యాచ్‌కు చెందిన వినాయక్ ప్రభాకర్ ఆప్టే, సౌమ్యమిశ్రా ఉన్నారు. ఇందులో అత్యంత సీనియర్ అయిన సివి ఆనంద్ నియామకానికి యూపిపీఎస్‌సి ఆమోదించింది. సివి ఆనంద్ తన సర్వీసులో కొంతకాలం పాటు కరీంనగర్, వరంగల్ ఎస్‌పీగా, సైబరాబాద్, విజయవాడ నగర కమిషనర్‌గా రెండు పర్యాయాలు హైదరాబాద్ నగర కమిషనర్‌గా పని చేశారు. ప్రస్తు తం తెలం గాణ హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. కొంతకాలం పాటు రాష్ట్ర సివిల్ సప్లైస్ కమిషనర్‌గా పని చేశారు. అలాగే అవినీతి నిరోధక బ్యూరో డిజి, విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్‌మెంట్ డిజి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ హోం శాఖ వంటి అనేక కీలక పదవులను నిర్వహిం చారు. హైదరాబా ద్ పాతబస్తీకి చెందిన సివి ఆనంద్ తండ్రి సి.దామోదర్ రెడ్డి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారిగా పనిశారు.
బేగంపేట హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో విద్యాభ్యాసం పూర్తి చేసిన సివి ఆనంద్ నిజాం కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ నుంచి ఎకనామిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించారు. చదువులోనే కాకుండా క్రీడల్లోనూ రాణించారు. భారత్ అండర్ -19 జట్టు తరఫున ఇంగ్లాండ్ జరిగిన మ్యాచ్‌కు ఎంపికయ్యారు. కేవలం 22 ఏళ్ల వయసులోనే తన మొదటి ప్రయత్నంలో ఐపిఎస్‌కు ఎంపికయ్యారు.పోలీస్ వ్యవస్థలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగాన్ని విస్తరిం చడంలో సివి ఆనంద్ కీల క పాత్ర పోషించారు. ముఖ్యం గా ట్రాఫిక్ విభాగంలో ఇ చలాన్ వ్యవస్థ, మహిళల భద్రతకు షీ టీమ్స్, షీ షటిల్ వంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అలాగే డ్రగ్స్ వాడకాన్ని అరికట్టడానికి హైదరాబాద్ నార్కొటిక్స్ ఎన్‌ఫో ర్స్‌మెంట్ వింగ్ ఏర్పా టుకు కృషి చేశారు. కొంతకాలం పాటు కేంద్రానికి డిప్యూటేషన్‌పై వెళ్లి సిఐఎస్ ఎఫ్ ఐజిగా, ఎన్‌ఐఎస్‌ఎ డైరెక్టర్‌గా కూడా పని చేశారు.ఎన్నికలను అద్భుతంగా నిర్వహించి ఎలక్షన్ కమిషన్ నుంచి నేషనల్ అవార్డు ను మాజీ రాష్ట్రపతి ఎపిజె అబ్దుల్ కలాం చేతుల మీదుగా అందుకోవడం సీవీ ఆనంద్ కెరీర్‌లో చెప్పుకోదగ్గ విశేషం.













